దోమల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి
సిద్దవటం: దోమలను నివారించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని కడప డీఎంహెచ్‌ఓ నాగరాజు పేర్కొన్నారు. సిద్ధవటం మండలంలోని మాధవరం–1 గ్రామ పంచాయతీ పార్వతీపురం గ్రామంలో శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ రాత్రివేళల్లో దోమలు కుట్టకుండా ప్రతి ఒక్కరూ దోమతెరలు తప్పకుండా వాడాలన్నారు.దోమలు వృద్ధి చెందకుండా ఉండాలంటే ఇంటి పరసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని తెలిపారు.శుభ్రత పాటిస్తే వ్యాధులు దరిచేరవన్నారు. కుష్టు వ్యాధి సర్వేలో భాగంగా వ్యాధిగ్రస్తులను పరామర్శించి తగు జాగ్రత్తలు తెలియజేశారు. మాధవరం ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి శివకుమార్ మాట్లాడుతూ నవంబర్ 17 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో స్పర్శ లేని పొడలు ఉన్న పేషెంట్లను గుర్తించి జాగ్రత్తలు సలహాలు సూచించామని తెలిపారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బరాయుడు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవిబాబు, డీపీఎంఓ రాఘవ, హెల్త్ సూపర్‌వైజర్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.


