ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
పులివెందుల రూరల్ : మండల పరిధిలోని చంద్రగిరి గ్రామానికి చెందిన నాగేష్(39) అనే వ్యక్తి శుక్రవారం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండలంలోని నరసప్పగారిపల్లెకు చెందిన నాగేష్‌కు ఆరేళ్ల క్రితం చంద్రగిరి గ్రామానికి చెందిన రమణమ్మతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. అప్పులు ఎక్కువ కావడంతో జీవితం మీద విరక్తి చెంది చంద్రగిరి గ్రామ సమీపంలోని మైన్స్‌కు వెళ్లే రహదారిలో బొందుగుట్ట వద్ద చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ సీతారామిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని నాగేష్ మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
కడుపు నొప్పి తాళలేక..
కొండాపురం : మండల పరిఽధిలోని ఓబన్నపేట గ్రామానికి చెందిన కల్లూరు ఓబుళరెడ్డి(71) శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఓబన్నపేట పునరావాస కాలనీలో ఉండే కె.ఓబుళరెడ్డి కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.


