రాయలసీమ రైతులకు చంద్రబాబు మోసం
చాపాడు : రాయలసీమ రైతులను మోసం చేసిన నాయకుడు, వ్యవసాయ వ్యతిరేకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. సీఎం చంద్రబాబు పెండ్లిమర్రి మండలంలో జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో.. రైతులను పూర్తిగా నిరాశకు గురి చేశారని ఆయన పేర్కొన్నారు. మొదటి ఏడాది పూర్తిగా పక్కన పెట్టారని, రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉల్లి నష్టపరిహారం మాట, పంటల బీమా రూ.173 కోట్లు అనుకున్నా కనీసం ఆ ఊసే లేదన్నారు. రాయలసీమకు సాగు నీరు తీసుకొచ్చాను అని చెప్పుకుంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు. మోంథా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోలేదని, గత నెల రోజులుగా అరటి ధరలు పూర్తిగా పడిపోయినా పట్టించుకోలేదని తెలిపారు. ప్రాంతాలు, భూములను బట్టి రైతులు పంటలు సాగు చేసుకుంటారని, కానీ చంద్రబాబు మాత్రం వరి వద్దు అంటూ ప్రతి చోట హేళనగా మాట్లాడటం తగదన్నారు.
వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు
సంబటూరు ప్రసాద్‌రెడ్డి


