నకిలీమరక.. ప్రజల్లోకి వెళ్లేదెలా?
ఇప్పట్లో ఇన్‌చార్జి ఊసులేదు
మదనపల్లె: ములకలచెరువులో అక్టోబర్ 3న నకిలీమద్యం తయారీ ప్లాంట్ వెలుగుచూడటంతో యావత్ రాష్ట్రం ఉలికిపాటుకు గురైంది. ఆరోజు కడప ఎకై ్సజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎకై ్సజ్ పోలీసులు జరిపిన దాడులతో తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రజలు ఆందోళళనకు గురయ్యారు. ఈ వ్యవహరంలో టీడీపీ నేతల ప్రమేయం వెలుగులోకి రావడం, నియోజకవర్గ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి పార్టీనుంచి సస్పెండ్ కావడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఈ పరిస్థితులతో తంబళ్లపల్లెలో టీడీపీ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి పడ్డట్టయ్యింది. మొన్నటిదాక టీడీపీ ఇన్‌చార్జిగా జయచంద్రారెడ్డి వద్దంటూ ఆ పార్టీ నేతలు, శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించగా ఇప్పుడు నకిలీమద్యం మరకతో ప్రజల్లోకి వెళ్లడం ఎలా అన్న అంతర్మథనం నెలకొంది.
క్షేత్రస్థాయిలో ప్రతిష్ట పోయింది
నకిలీమద్యం తయారీ కేసులో జయచంద్రారెడ్డి పేరు నిందితుల జాబితాలో చేర్చడంతో నియోజకవర్గంలో టీడీపీ ప్రతిష్ట మసకబారింది. పీటీఎం టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడు అరెస్ట్, తదితర అంశాలు ఆ పార్టీని ఆంతర్మథనంలో పడే శాయి. ఈ వ్యవహారం వెవెలుగులోకి రాకముందు వరకు టీడీపీ శ్రేణులు జయచంద్రారెడ్డిని వ్యతిరేకించినప్పటికీ అధికారంలో ఉన్నామన్న ఉత్సాహంతో కనిపించారు. సొంతగానే కార్యక్రమాలను నిర్వహించుకొంటూ వచ్చారు. అయితే ఈ కేసు తర్వాత ఆ పార్టీ శ్రేణులు ఒకరకంగా చతికిలపడిపోయారు. నకిలీమరకతో ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అని పార్టీనేతలు చర్చించుకుంటున్నారు.జయచంద్రారెడ్డి వర్గీయులు ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉన్నారు.
● టీడీపీ ఇన్‌చార్జిగా ఉంటూ సస్పెండ్ అయిన జయచంద్రారెడ్డితోపాటు ఆయన బావమరిది గిరిధర్‌రెడ్డి, పీఏ రాజేష్, ఇంటి పనిమనిిషి అన్బురాసు నకిలీమద్యం కేసులో నిందితులుగా ఉన్నారు. వీరిప్పటికీ అరెస్ట్ కాలేదు. నకిలీమద్యం కేసులో టీడీపీ నేతల ప్రమేయం స్పష్టంకావడంతో వారు ఏమిచెప్పినా నమ్మే పరిస్థితులు లేనంత లోతుగా ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఇన్నాళ్ళు తామంతా నకిలీమద్యం తాగామన్న భయం వారిలో నెలకొంది. దీనివల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపిందా అన్న భయం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గ టీడీపీ నేతలు దీనిపై నిశ్శబ్దంగా ఉండిపోతున్నారు.
ములకలచెరువు నకిలీమద్యం తయారీ కేసుతో మసకబారిన టీడీపీ ప్రతిష్ట
జయచంద్రారెడ్డిని పార్టీనుంచి సస్పెండ్ చేసినా ఆస్థానంలో కొత్త వారు ఎవరో పార్టీతేల్చలేదు. ఎవరి నియమిస్తారో కనీసం ఊహకై నా చెప్పడంలేదు. పరిస్థితి చూస్తుంటే ఇన్‌చార్జి నియామకం ఇప్పట్లో లేనట్టే అని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల పార్టీ కేంద్రకార్యాలయంలో నియోజకవర్గ నేతలతో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సమావేశం నిర్వహించగా ఎవరికివారు ఇన్‌చార్జి పేరును ప్రతిపాదించినా అది నా పరిధిలో లేదంటూ ఆయన తప్పించుకున్నారు. ఇంతలో ఓ నేత ఇన్‌చార్జి పదవి ఆశిస్తున్నట్టు చెప్పడంతో ఆ నేతపై విరుచుకుపడ్డంతో వివాదం అవుతుందని సమావేశం ముగించేశారు. తంబళ్లపల్లె విషయంలో ఆదినుంచి నెలకొన్న వివాదాలతో పార్టీ అధిష్టానానికి చిరాకు తెప్పిస్తుండగా ఇప్పుడు నకిలీమద్యం తయారీ కేసు వ్యవహారం ఉక్కరిబిక్కిరి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ ఇన్‌చార్జి విషయం తేల్చే అవకాశం లేదు.


