
ఏసీఏ అండర్–16 మల్టీ డే మ్యాచ్ ప్రారంభం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–16 మల్టీ డే మ్యాచ్‌లు గురువారం ప్రారంభమయ్యాయి. కడప వైఎస్సార్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో తొలి రోజున కడప–కర్నూలు జట్లు తలపడ్డాయి. టాస్ గెలుచుకున్న కడప జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 65.3 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని రుత్విక్ కల్యాణ్ 40 పరుగులు, రోహిత్ గౌడ్ 35 పరుగులు చేశారు. కడప జట్టులోని చెన్నకేశవ అద్భుతంగా చక్కటి లైనప్‌తో బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీశాడు. అదే విధంగా జయప్రణవ శాస్త్రి 2, క్యాశప్‌రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 24 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.
కెఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో..
కెఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో నెల్లూరు–అనంతపురం జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన నెల్లూరు జట్టు బ్యాంటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 59.5 ఓవర్లకు 224 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని అలెన్ లియో 61 పరుగులు, సుశాంత్ 42 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని టి.కిరణ్‌కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీశారు. సంజయ్ 2, దేవాన్ష్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 34 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. ఆ జట్టులోని సాత్విక్ 23 పరుగులు చేశాడు దీంతో తొలి రోజు ఆట ముగిసింది.

ఏసీఏ అండర్–16 మల్టీ డే మ్యాచ్ ప్రారంభం

ఏసీఏ అండర్–16 మల్టీ డే మ్యాచ్ ప్రారంభం