
చెప్పులేసుకొని రొట్టెలు వదిలిన ఎమ్మెల్యే
– ముస్లింల మనోభావాలు దెబ్బతీశారని విమర్శలు
కడప కార్పొరేషన్ : మొహర్రం పండుగను పురస్కరించుకొని నాదర్ షా వలీ దర్గా ఉరుసుకు ప్రభుత్వ విప్, కడప శాసనసభ్యురాలు ఆర్. మాధవి హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా ప్రతినిధులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం కేసీ కెనాల్‌లో రొట్టెలు వదిలే సందర్భంగా ఎమ్మెల్యే చెప్పులు వేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో పవిత్రంగా రొట్టెలు వదిలే కార్యక్రంలో ఎమ్మెల్యే చెప్పులు వేసుకొని ముస్లింల మనోభావాలు దెబ్బతీశారని పలువురు విమర్శిస్తున్నారు.