
ఢిల్లీ వర్క్‌షాప్‌లో కలెక్టర్
కడప సెవెన్‌రోడ్స్ : న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ వర్క్ షాప్‌కు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఆయన కలిశారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్టు కార్యకలాపాలు, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మంత్రికి కలెక్టర్ వివరించారు. గండికోటలో జరుగుతున్న పర్యాటక మౌలిక సదుపాయాల గురించి తెలియజేశారు.
11 చీనీ మొక్కల నరికివేత
కొండాపురం : మండలంలోని తాళ్లప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళ్లప్రొద్దుటూరు గ్రామానికి చెందిన గోవర్ధన్‌రెడ్డికి చెందిన 3.5 ఎకరాల చీనీ తోటలో 11 చీనీ చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికినట్లు తాళ్లప్రొద్దుటూరు ఎస్‌ఐ హృషికేశ్వర్‌రెడ్డి బుధవారం తెలిపారు. గోవర్శన్‌రెడ్డి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మండలానికి
ఒక కిసాన్ డ్రోన్
సిద్దవటం : ప్రతి మండలానికి 80 శాతం రాయితీపై ఒక కిసాన్ డ్రోన్ ఇస్తామని రైతు బృందాలు అధికారులను సంప్రదించాలని జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు చంద్రనాయక్ తెలిపారు. సిద్దవటం మండలం శాఖరాజుపల్లెలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మల్‌చింగ్ షీట్ పద్ధతిలో సాగు చేసిన దోస పంట పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు వివరించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులు ఈకేవైసీ ఫింగ్ ద్వారా చేయించుకోవాలన్నారు. రైతులకు అవసరమైన ఎరువు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. అనంతరం సిద్దవటం వ్యవసాయ కార్యాలయంలో ఎరువుల పంపిణీని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏవో రమేష్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, శివకుమార్, మురళి, రైతులు పాల్గొన్నారు.

ఢిల్లీ వర్క్‌షాప్‌లో కలెక్టర్