
ఉత్సాహంగా ఏసీఏ అండర్–19 మల్టీడే మ్యాచ్
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్‌లు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. రెండో రోజు బుధవారం వైఎస్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో కడప–అనంతపురం జట్లు తలపడ్డాయి. తొలి ఇన్నింగ్స్‌లో 461 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్‌ను ప్రారంభించిన కడప జట్టు 93.2 ఓవర్లలో 495 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులోని ఆర్దిత్ రెడ్డి 76 బంతుల్లో సెంచురీ చేశాడు. అనంతపురం జట్టులోని కెహెచ్.వీరారెడ్డి 4 వికెట్లు, నవదీప్ 3 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 67 ఓవర్లకు 250 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులోని కెహెచ్.వీరారెడ్డి 177 బంతుల్లో 133 పరుగులు, సాత్విక్ 41 పరుగులు చేశాడు. కడప జట్టులోని ధీరజ్ కుమార్ రెడ్డి 4 వికెట్లు, ఆర్దిత్‌రెడ్డి 4 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 15 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 74 పరుగులు చేసింది. కడప జట్టు 319 పరుగుల అధిక్యంలో కొనసాగుతున్నది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది.
కెఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో..
కెఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరుగుతున్న మరో మ్యాచ్‌లో 11 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు మ్యాచ్‌ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 63.4 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సాయి చరణ్ 63 పరుగులు, బాలాజీ 55 పరుగులు చేశారు. కర్నూలు జట్టులో మహిత్ 4 వికెట్లు, మల్లి ఖార్జున 2 వికెట్లు, విఖ్యాత్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 28 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. ఆ జట్టులోని మురళీ హృదయ్ 60 పరుగులు, కెవి ఓంకార్ 43 పరుగులు చేశారు. కర్నూలు జట్టు 174 పరుగుల అధిక్యంలో కొనసాగుతోంది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది.

ఉత్సాహంగా ఏసీఏ అండర్–19 మల్టీడే మ్యాచ్

ఉత్సాహంగా ఏసీఏ అండర్–19 మల్టీడే మ్యాచ్