
కూలిన బీవీఎస్ కాంప్లెక్స్ గోడ
ప్రొద్దుటూరు : స్థానిక బీవీఎస్ థియేటర్ ముందున్న కాంప్లెక్స్‌గోడ కూలి శ్రీచక్ర ఫర్నీచర్ షాప్‌పై పడటంతో తీవ్ర నష్టం జరిగింది. గత పది రోజులుగా కాంప్లెక్స్‌ను బుల్డోజర్ సహాయంతో తొలగిస్తున్నారు. సోమవారం రాత్రి సమయంలో పనులు చేపడుతుండగా ఉన్నట్లుండి 50 అడుగుల పొడవు ఉన్న గోడ కూలి పక్కనే ఉన్న ఫర్నీచర్ షాప్‌పై పడింది. దీంతో ఫర్నీచర్ షాప్‌లోని బీరువాలు, ఫర్నీచర్ సామగ్రి దెబ్బతింది. పొరపాటున పగటి వేలలో ఈ ప్రమాదం జరిగి ఉంటే మెయిన్‌రోడ్డుపై ఉన్న మనుషులపై పడి తీవ్ర నష్టం కలిగేది.
ముందుగా హెచ్చరించినా ఫలితం లేదు..
గత పది రోజులుగా బీవీఎస్ కాంప్లెక్స్‌ను తొలగిస్తున్నారని శ్రీచక్ర ఫర్నీచర్ షాప్ యజమాని గాండ్ల నారాయణ స్వామి తెలిపారు. సరైన నిబంధనలను పాటించకపోవడంతో అప్పుడప్పుడు కాంప్లెక్స్‌కు సంబంధించిన రాళ్లు తమ దుకాణంపై పడేవన్నారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశానని, సోమవారం ఉదయం నేరుగా టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చానన్నారు. పోలీసులు స్వయంగా వచ్చి జాగ్రత్తలు పాటించాలని సూచించారన్నారు. చెప్పా పెట్టకుండా రాత్రివేళ పనులు ప్రారంభించారని, బీవీఎస్ కాంప్లెక్స్‌కు సంబంధించిన మొత్తం నిర్మాణమంతా తమ షాపువైపు పడటంతో తమకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. షాపులో సుమారు రూ.2కోట్ల మేర ఫర్నీచర్ ఉందని, దాదాపు రూ.30లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు ఆయన వివరించారు. తమకు బీవీఎస్ యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్లు ఆయిల్‌మిల్ ఖాజా, పాతకోట బంగారు మునిరెడ్డి పరిశీలించారు. షాప్ యాజమాని నారాయణస్వామితో మాట్లాడారు.
ఫర్నీచర్ షాప్‌పై పడి రూ.30 లక్షల ఆస్తినష్టం

కూలిన బీవీఎస్ కాంప్లెక్స్ గోడ