
బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం
కడప కార్పొరేషన్ : మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి కొనియాడారు. ఆదివారం జగ్జీవన్‌రామ్ 39వ వర్ధంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో మేయర్ కె. సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషాలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధునిగా, దేశానికి తొలి ఉప ప్రధానమంత్రిగా బాబూ జగ్జీవన్ రామ్ దేశానికి ఎనలేని సేవలు అందించారని తెలిపారు. కార్మిక శాఖామంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా కొనసాగిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. జగ్జీవన్ రామ్ అడుగుజాడలలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు.
జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఘన నివాళి
అంతకుముందు మహావీర్ సర్కిల్‌లోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషాలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్ రామ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షుడు కంచుపాటి బాబు, నాయకులు పులి సునీల్ కుమార్, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, దేవిరెడ్డి ఆదిత్య, షేక్ షఫీవుల్లా, రామక్రిష్ణారెడ్డి, సీహెచ్ వినోద్, చెన్నయ్య పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి. రవీంద్రనాథ్‌రెడ్డి