పెద్దదర్గాకు ఉత్సవ శోభ | - | Sakshi
Sakshi News home page

పెద్దదర్గాకు ఉత్సవ శోభ

Jul 6 2025 6:57 AM | Updated on Jul 6 2025 6:57 AM

పెద్దదర్గాకు ఉత్సవ శోభ

పెద్దదర్గాకు ఉత్సవ శోభ

కడపలోని పెద్దదర్గా

కడప సెవెన్‌రోడ్స్‌: దేశంలోనే ప్రసిద్ధిగాంచిన మహిమాన్విత సూఫీ క్షేత్రం కడప పెద్దదర్గా ఉత్సవ శోభ సంతరించుకుంది. దర్గాలో ప్రధాన గురువులైన హజరత్‌ ఖ్వాజా సయ్యద్‌షా పీరుల్లా మాలిక్‌ సాహెబ్‌ గంధోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించనున్నా రు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు దర్గా నిర్వాహ కులు పూర్తి చేశారు. గంధోత్సవాన్ని దర్శించి తరించేందుకు శనివారం నాటికే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు దర్గా ఆవరణకు చేరుకున్నారు.

తొలి గురువు నేపధ్యం

మహమ్మద్‌ ప్రవక్త వంశీయులుగా చెప్పబడే దర్గా తొలి గురువు హజరత్‌ పీరుల్లా మాలిక్‌ సాహెబ్‌ 16వ శతాబ్దంలో కర్ణాటకలోని బీదర్‌ నుంచి కడపకు వచ్చారు. ప్రజలకు ఆధ్యాత్మిక విషయాలను బోధి స్తుండేవారు. భగవంతుని దృష్టిలో మనుషులంద రూ ఒక్కటేనని, కలిసిమెలిసి జీవించాలంటూ ఆయ న ప్రబోధిస్తూ వచ్చారు. అనతి కాలంలోనే ఆయన మహిమలు, గొప్పతనం చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. ఆయన గొప్పతనాన్ని వినడమే కాకుండా ప్రత్యక్షంగా చూసిన సిద్దవటం నవాబు శిష్యునిగా మారారు. హజరత్‌ పీరుల్లామాలిక్‌ సాహె బ్‌ ఇక్కడే జీవ సమాధి పొందారు. సుప్రసిద్ధ హిందూ ధార్మికవేత్త, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు పద్మవిభూషణ్‌ పండిట్‌ రవిశంకర్‌ ఓమారు పెద్దదర్గాను దర్శించారు. దర్గా సందర్శన వల్ల తనకు ఎనలేని ఆత్మసంతృప్తి, ప్రశాంతత లభించాయని తెలిపారు. ప్రధాన గురువు మజార్‌ వద్ద ఏదో తెలియని ఆకర్శణ శక్తి ఉందన్నారు. దర్గా నిర్వాహకుల అనుమతితో ఆయన కాసేపు మజా ర్‌ వద్ద కూర్చొని ధ్యానంలో గడపడం విశేషం.

నేటి కార్యక్రమాలు .. హజరత్‌ ఖాజా సయ్యద్‌ షా పీరుల్లా మహమ్మద్‌ మహమ్మదుల్‌ హుస్సేని చిస్టివుల్‌ ఖాద్రి సాహెబ్‌ గంధం ఉత్సవంలో భాగంగా ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు గంధ మహోత్సవం జరగనుందని దర్గా ప్రతినిధులు తెలిపారు. మొహర్రం నెల 10వ రోజు గురువులు జీవ సమాధి పొందిన రోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

నేడు హజరత్‌ పీరుల్లా మాలిక్‌ సాహెబ్‌ గంధోత్సవం

ఏర్పాట్లు పూర్తి చేసిన దర్గా నిర్వాహకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement