
ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో న్యాయం చేయండి
కడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజిఆర్‌ఎస్)కు వచ్చిన ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ‘ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక‘ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి సదరు ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులకు పోలీసు సిబ్బంది ప్రశాంతంగా తమ సమస్యను వివరించడానికి సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో డి.టి.సి డీఎస్పీ అబ్దుల్ కరీం, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్