
అడ్మిషన్ల ప్రక్రియను విజయవంతం చేయాలి
వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి జరిగే అడ్మిషన్ల ప్రక్రియను ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఉద్యోగులు విజయవంతం చేయాలని ఆర్కేవ్యాలీ డైరెక్టర్ కుమార స్వామి గుప్తా కోరారు. శనివారం మండలంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో క్యాంపస్ అడ్మిషన్ల ప్రక్రియపై ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలోని సెంట్రల్ లైబ్రరీలో అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా ఈనెల 30, జూలై 1న రెండు రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అడ్మిషన్లకు ఎంపికై న విద్యార్థులకు ఇప్పటికే కాల్ లెటర్లు కూడా పంపామన్నారు. కౌన్సెలింగ్‌కు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు మూడు సెట్లు జిరాక్స్ పత్రాలను, విద్యార్థి ఫొటోతోపాటు తల్లిదండ్రుల, సంరక్షకుల ఫొటోలను కూడా వెంట తీసుకుని రావాలన్నారు. సమావేశంలో అకడమిక్ డీన్ రమేష్ కై లాస్, అసోసియేట్ డీన్స్, సెక్యూరిటీ అధికారులు, పీఆర్‌ఓలు, అధ్యాపకులు పాల్గొన్నారు.