రూ. 2 లక్షల వితరణ | Sakshi
Sakshi News home page

రూ. 2 లక్షల వితరణ

Published Thu, Jan 18 2024 1:18 AM

-

చింతకొమ్మదిన్నె : మండలంలోని బయనపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి తుమ్మల పరమేశ్వర్‌ రెడ్డి 2 లక్షల రూపాయలు వితరణగా ఇచ్చినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు బుధవారం మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణానికి సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే బైనపల్లి గ్రామానికి చెందిన ప్రజలే కాకుండా వివిధ గ్రామాల ప్రజలు ఆలయ నిర్మాణానికి విరాళాలు అందజేయడం చాలా సంతోషకరమని అన్నారు.

విజిలెన్స్‌ అధికారుల దాడులు

చింతకొమ్మదిన్నె : కడప రీజినల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి షేక్‌ మాసుం బాషా ఆదేశాల మేరకు బుధవారం విజిలెన్స్‌ అధికారులు సీకే దిన్నె మండలం కృష్ణాపురం గ్రామంలో దాడులు నిర్వహించారు. స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఐదు గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్లను వాణిజ్య అవసరాల నిమిత్తం వాడుతున్నట్లు గుర్తించి స్వాఽధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని పెండ్లిమర్రి గంగ ఇండేన్‌ ఏజెన్సీ వారికి అప్పగించారు. హోటల్‌ యజమాని నరసింహారెడ్డిపై నిత్యావసర సరుకుల చట్టం–1955 మేరకు 6–ఏ కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్‌ అధికారి రెడ్డెప్ప, సీఐ బాలగంగాధర్‌రెడ్డి, వ్యవసాయాధికారి సౌజన్య, కడప సీఎస్‌డీటీ, హెడ్‌కానిస్టేబుల్‌ జనార్దన్‌రావు, హరినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement