30న జిల్లాస్థాయి హ్యాండ్‌బాల్‌ ఎంపికలు | Sakshi
Sakshi News home page

30న జిల్లాస్థాయి హ్యాండ్‌బాల్‌ ఎంపికలు

Published Tue, Nov 28 2023 2:24 AM

-

కడప స్పోర్ట్స్‌: వేంపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఈనెల 30వ తేదీ ఉదయం 8 గంటలకు జిల్లాస్థాయి సబ్‌జూనియర్‌ హ్యాండ్‌బాల్‌ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె. చిన్నపరెడ్డి, కార్యదర్శి సింధూరి తెలిపారు. 2008 జనవరి 1 తర్వాత పుట్టినవారు ఎంపికలకు అర్హులన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు వయో ధ్రువీకరణపత్రం, ఆధార్‌కార్డు, స్టడీసర్టిఫికెట్‌తో హాజరుకావాలని సూచించారు. బాలబాలికలకు నిర్వహించే ఈ ఎంపికల్లో చక్కటి ప్రతిభ కనబరిచి జిల్లా జట్టుకు ఎంపికయ్యే క్రీడాకారులు డిసెంబర్‌ 8 నుంచి 10వ తేదీ వరకు గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు.

Advertisement
 
Advertisement