అందరికీ న్యాయం.. అందాలన్నదే నినాదం | Sakshi
Sakshi News home page

అందరికీ న్యాయం.. అందాలన్నదే నినాదం

Published Thu, Nov 9 2023 1:12 AM

- - Sakshi

కడప అర్బన్‌: బలహీన వర్గాలకు దేశ వ్యాప్తంగా ఎలాంటి రుసుము లేకుండా న్యాయ సేవలు అందించేందుకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పనిచేస్తోంది. జిల్లాలో గ్రామాలను దత్తత తీసుకుని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌, లేబర్‌, మహిళా శిశుసంక్షేమాభివృద్ది, ట్రైబర్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ సహకారంతో ఫిర్యాదులు లేకుండా చేయాలని లక్ష్యంగా న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. దేశ వ్యాప్తంగా నవంబర్‌ 9న ప్రజలకు న్యాయం జరగాలన్నదే మా లక్ష్యం నినాదంతో ‘న్యాయ సేవల దినోత్సవం( లీగల్‌ సర్వీసెస్‌ డే)’ జరుపుకొంటున్నారు. ఈ నెల 9న (గురువారం) జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘ఐవిఆర్‌ఎస్‌ టెక్నాలజీ’ ద్వారా నేషనల్‌ టోల్‌ఫ్రీ హెల్స్‌ లైన్‌ నెంబర్‌ 15100 ప్రారంభించనున్నారు. ఎన్‌సీ డబ్ల్యూ మొబైల్‌ అప్లికేషన్‌ ‘హెర్‌ లీగల్‌ గైడ్‌’నీ వర్చువల్‌ మోడ్‌ ద్వారా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి, డిఎల్‌ఎస్‌ఏ ఇన్‌ఛార్జ్‌ సెక్రటరీ ఎం. ప్రదీప్‌కుమార్‌, సిబ్బందితో కలిసి ఉదయం 9:15 గంటలకు ప్రారంభిస్తారు. అనంతరం ర్యాలీ నిర్వహించనున్నారు.

సేవలందించడమే ధ్యేయం

జిల్లా న్యాయసేవాధికా సంస్థ సేవలందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. మండల న్యాయ సేవా సమితి న్యాయ విజ్ఞాన సదస్సులు, ఉచిత న్యాయ సహాయం, లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టం, లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ విధి విధానాలను, ఇంటింటి న్యాయ ప్రచారాలు, స్కూల్స్‌, కాలేజీలలో ‘లీగల్‌ లిటరసీ’క్లబ్స్‌ ఏర్పాటు, విద్యార్థులకు చట్టాలపై అవగాహన, షెల్టర్‌ హోమ్‌లు, ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌లు, చిల్డ్రన్‌ హోమ్‌లు, వెల్ఫేర్‌ హాస్టల్‌లు పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తున్నారు. కడప న్యాయసేవాధికార సంస్థ 2022 నవంబరు నుంచి ఈ ఏడాది అక్టోబరు వరకు 467 న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించడమేగాక, 119 మందికి ఉచిత న్యాయ సహాయం అందించింది. నాలుగు జాతీయ లోక్‌ అదాలత్‌ల ద్వారా 53500 కేసులు, మూడు ప్రత్యేక లోక్‌ అదాలత్‌ల ద్వారా 103 కేసులు రాజీ చేయగలిగారు. మహిళలు, వికలాంగులు, షెడ్యూల్‌ తెగలు, పిల్లలు, షెడ్యూల్‌ కులాలు, మానవ అక్రమ రవాణా బాధితులు.. అలాగే ప్రకృతి వైపరీత్యాల బాధితులైన బలహీన వర్గాలకు ఎలాంటి రుసుము లేకుండా న్యాయసేవలను అందించారు.

నేడు న్యాయసేవల దినోత్సవం

కడపలోని జిల్లా కోర్టులో మీటింగ్‌, ర్యాలీ

Advertisement
 

తప్పక చదవండి

Advertisement