శ్రీవాణి..ఆధ్యాత్మిక బాణీ | Sakshi
Sakshi News home page

శ్రీవాణి..ఆధ్యాత్మిక బాణీ

Published Thu, Nov 9 2023 1:12 AM

- - Sakshi

నియోజకవర్గం శ్రీవాణి ట్రస్టుకు

ఎంపికై న

దేవాలయాలు

మదనపల్లె సిటీ: అన్నమయ్య జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియనుంది. ఆయా కాలనీల్లో నూతన ఆలయాల నిర్మాణం, పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణకు తిరుమల, తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్టు ద్వారా భారీగా నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు జిల్లాలో 172 ఆలయాలకు మొత్తం రూ.1.72 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో జిల్లాలో పలు ఆలయాల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

హిందూ ధర్మ ప్రచారం, దేవాలయాల నిర్మాణం, పూరాతన ఆలయాల జీర్ణోద్ధరణకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వాణి ట్రస్టు ద్వారా భారీ నిధులు మంజూరు చేసింది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో రామాలయం, శివాలయం, నరసింహస్వామి దేవస్థానం, గ్రామదేవతల ఆలయాలను నిర్మించుకునేందుకు, అలాగే ఎక్కడైనా పురాతన ఆలయాలు శిథిలావస్థకు చేరి ఉంటే వాటి జీర్ణోద్ధరణకు శ్రీవాణి ట్రస్టు ద్వారా నిధులు మంజూరు చేస్తోంది. కనీసం రూ.10 లక్షలకు తక్కువ కాకుండా నిధులు అందిస్తోంది. వీటితో పాటు గ్రామస్థులు, దాతల సహకారం ఇతరత్రా మార్గాల్లో పెద్ద ఎత్తున దేవాలయాలను నిర్మించేందుకు శ్రీవాణి ట్రస్టు కృషి చేస్తోంది. అందులో భాగంగా జిల్లాలో 172 ఆలయాలకు ఒక్కొక్క దేవాలయానికి రూ.10లక్షలు చొప్పున రూ.1.72 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఆలయాల పనులు వివిధ దశలో జరుగుతున్నాయి. జిల్లాలో 172 ఆలయాల్లో ఫేస్‌–1లో 57 దేవాలయాలు మంజూరు కాగా, అందులో 4 దేవాలయాలు పూర్తి చేశారు. మిగిలిన 53 ఆలయాల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఫేస్‌–2లో 61 దేవాలయాలు మంజూరు కాగా, 6 దేవాలయాల నిర్మాణ పనులు పూర్తికాగా మిగిలిన 55 ఆలయాల పనులు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఫేస్‌–3లో 54 దేవాలయాలు మంజూరుకాగా వివివిధ దశల్లో పనులు జరుగుతున్నాయి.

అన్నమయ్య జిల్లాలో 172 ఆలయాల జీర్ణోద్ధరణ

నూతన దేవాలయాల నిర్మాణానికి నిధులు

ఒక్కో ఆలయానికి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేసిన టీటీడీ

ఈ నిధులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో దేవాలయాల నిర్మాణం

రాయచోటి 54

రైల్వేకోడూరు 40

రాజంపేట 48

పీలేరు 8

తంబళ్లపల్లె 13

మదనపల్లె 9

అధ్యాత్మికతను పెంపొందించేందుకు..

ప్రజల్లో అధ్యాత్మికతను పెంపొందించేందుకు ఆలయాల నిర్మాణం, పురాతన దేవస్థానాల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాం. టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా జిల్లాలో 172 ఆలయాలకు నిధులు మంజూరు చేయడం సంతోషకరం. టీటీడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. –విశ్వనాథ్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌,

దేవదాయశాఖ, రాయచోటి

1/1

Advertisement
 

తప్పక చదవండి

Advertisement