సోషల్‌ వెల్ఫేర్‌ డీడీగా సరస్వతి

- - Sakshi

కడప రూరల్‌: జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ (సోషల్‌ వెల్ఫేర్‌) డిప్యూటీ డైరెక్టర్‌గా సరస్వతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఈమె కృష్ణా జిల్లా డీడీగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఆ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న జయప్రకాష్‌ ఏలూరు జిల్లా జాయింట్‌ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు.

ఐసీడీఎస్‌ పీడీగా శ్రీలక్ష్మి

కడప కోటిరెడ్డిసర్కిల్‌: జిల్లా సీ్త్ర శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఎంఎన్‌ రాణి స్థానంలో దేవిరెడ్డి శ్రీలక్ష్మిని నియమించారు. ఈమె అన్నమయ్య అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఇప్పటివరకు పనిచేస్తున్నారు. కాగా, ఎంఎన్‌ రాణికి ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు.

జిల్లా రిజిస్ట్రార్‌గా

పీవీఎన్‌ బాబు

కడప కోటిరెడ్డిసర్కిల్‌: స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌శాఖ జిల్లా రిజిస్ట్రార్‌గా తిరుపతి నుంచి పీవీఎన్‌ బాబును బదిలీ చేశారు. కడపలో పనిచేస్తున్న చెన్నకేశవరెడ్డి నంద్యాల జిల్లాకు బదిలీ అయ్యారు.

మార్కెటింగ్‌శాఖ

డీడీగా శ్రీకాంత్‌రెడ్డి

కడప అగ్రికల్చర్‌: కడప మార్కెటింగ్‌శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా శ్రీకాంత్‌రెడ్డి నియమితులయ్యారు. ఈయన ఆదోనిలో పనిచేస్తూ ప్రస్తుత బదిలీల్లో కడపకు వస్తున్నారు. కడపలో డీడీగా పనిచేస్తున్న లావణ్య విజయవాడకు బదిలీ అయ్యారు. డీడీగా నియామకమైన శ్రీకాంత్‌రెడ్డి నేడో, రేపో బాధ్యతలను స్వీకరించనున్నారు.

శరవేగంగా పింఛన్ల పంపిణీ

కడప రూరల్‌: జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌ పింఛన్‌ కానుక కింద వలంటీర్ల ద్వారా పింఛన్ల నగదు పంపిణీ శరవేగంగా జరుగుతోంది. మొత్తం 2,52,913 పింఛన్లకు మొత్తం రూ 69,76,85,500 పంపిణీ చేయాలి. అందులో భాగంగా రెండవ రోజైన శుక్రవారం 2,40,301 మంది పింఛన్లకు గాను రూ 66,31,28,500 పంపిణీ చేశారు. దీంతో రాత్రి 8 గంటలకు 95.06 శాతం నమోదైంది.

టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

కడప కోటిరెడ్డిసర్కిల్‌: కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో టైలరింగ్‌, బ్యూటీపార్లర్‌ మేనేజ్‌మెంట్‌లో 30 రోజులపాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు కెనరా బ్యాంకు ఆర్‌సెట్‌ డైరెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వైఎస్సార్‌, అన్నమయ్య జిల్లాలకు చెందిన నిరుద్యోగ మహిళలు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని.. ఈనెల 5వ తేదీ నుంచి శిక్షణను ప్రారంభిస్తున్నామన్నారు. ఇతర వివరాలకు 94409 05478, 63028 33546 నంబర్లలో సంప్రదించాలన్నారు.

Read latest YSR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top