అన్నప్రసాద కేంద్రంలో ఇబ్బందులు తలెత్తొద్దు
యాదగిరిగుట్ట : నూతనంగా ప్రారంభించిన అన్నప్రసాద వితరణ కేంద్రంలో అవసరమైన వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈఓ ఈఓ వెంకట్రావ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన తన చాంబర్‌లో ఆలయంలోని వివిధ విభాగాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. అన్న ప్రసాదం వితరణ సమయంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ఏవైనా సౌకర్యాలు లేకపోతే వెంటనే సమకూర్చాలని సూచించారు. ఆలయంలో స్వామివారికి నిర్వహించే సేవలు, పూజలు, దర్శన వేళలు తదితర అంశాలకు సంబంధించి వివరాలతో కూడిన సూచిక బోర్డులను ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు సదుపాయాలను మరింత మెరుగుపరచడం, సమన్వయ విధానాలను బలోపేతం చేయడంపై మార్గదర్శకాలను జారీ చేశారు. అయ్యప్ప మాలధారణ భక్తులు గిరిప్రదక్షిణ సందర్భంగా తగిన చర్యలు తీసుకొని జయప్రదం చేసినందుకు స్పెషల్ ప్రొటక్షన్ గ్రూఫ్ (ఎస్‌పీఎఫ్) సిబ్బందిని ఈఓ వెంకట్రావ్ అభినందించారు.
గుట్ట ఆలయ ఈఓ వెంకట్రావ్


