రాజీమార్గం ద్వారానే కేసులు సత్వర పరిష్కారం
భువనగిరి: రాజీమార్గం ద్వారా సత్వర న్యాయం పొందవచ్చని జిల్లా మొదటి అదనపు జడ్జి ముక్తిదా అన్నారు. ఈనెల 15న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారానికి న్యాయవాదులు, పోలీసు అధికారులు చొరవ చూపాలని కోరారు. శనివారం జిల్లా కోర్టులో లోక్ అదాలత్ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. న్యాయవాదుల మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని కక్షిదారులకు సూచించారు. సివిల్ జడ్జి ఉషశ్రీ మాట్లాడుతూ జిల్లాలో 1,147 కేసులు రాజీకి ఆమోదయోగ్యంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో అదనపు సీనియర్ సివిల్ జడ్జి శ్యాంసుందర్, భువనగిరి న్యాయవాదుల సంఘం సెక్రటరీ బోల్లేపల్లి కుమార్, ఏసీపీ శ్రీనివాస్‌నాయుడు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ భుపాల్‌రెడ్డి, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ వెంకటేష్, న్యాయవాదులు పాల్గొన్నారు.
ఫ జిల్లా మొదటి అదనపు జడ్జి ముక్తిదా


