3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
భువనగిరి: విద్యుత్ వినియోగదారుల దినోత్సవాన్ని జయప్రదం చేయాలని విద్యుత్ శాఖ భువనగిరి డివిజన్ డీఈ వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భువనగిరి డివిజన్ కార్యాలయ ఆవరణలో ఈనెల 3వ తేదీన మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుందన్నారు. విద్యుత్ వినియోగదారులు పెద్ద సంఖ్యలో హాజరై మెరుగైన విద్యుత్ సరఫరాకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.
నృసింహుడి సన్నిధిలో దేవాదాయ కమిషనర్
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని శనివారం దేవాదాయ శాఖ కమిషనర్, ఆలయ ఇంచార్జ్ ఈఓ హరీష్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లక్ష పుష్పార్చనలో పాల్గొన్నారు. ఆయనకు అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. అంతకుముందు ఆలయానికి చెందిన యాదగిరి మాస పత్రిక మూడవ సంచికను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు సురేంద్రచార్యులు, యాదగిరి మాసపత్రిక ఎడిటర్ ఈశ్వర్‌కుమర్ పాల్గొన్నారు.
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి మార్కింగ్
చౌటుప్పల్ : రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లోని తాళ్లసింగారం వద్ద మార్కింగ్ వేశారు. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి గ్రామ శివారులోని ము త్యాలమ్మ ఆలయం వద్ద మార్కింగ్ వేసినట్లు స్థానికులు తెలిపారు. చౌటుప్పల్‌తో పాటు మరే ప్రాంతంలోనూ మార్కింగ్ వేయలేదు. కాగా మార్కింగ్ వేసినట్లు తమకు తెలియదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మార్కింగ్ విషయం తెలిసి రైతులు ఆందోళన చెందుతున్నారు.
5న ఆర్చరీ పోటీలు
నల్లగొండ టూటౌన్ : భువనగిరిలో ఈనెల 5న ఉమ్మడి జిల్లాస్థాయి సబ్ జూనియర్, జూనియర్ ఆర్చరీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆర్చరీ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, తునికి విజయసాగర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు పుట్టిన తేదీ, బోనఫైడ్ సర్టిఫికెట్లతో న్యూ డైమెన్షన్ పాఠశాల వద్దకు ఉదయం 9 గంటలకు చేరుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 99120 55678 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం


