విచారణ చేయాలి
సాక్షి,యాదాద్రి : యాదగిరిగుట్ట దేవస్థానంలో చోటు చేసుకున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని కోరుతూ బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం అదనపు కలెక్టర్ వీరారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అశోక్‌గౌడ్ మాట్లాడుతూ ఆలయ ఏఈఓ, డీఈఓ అక్రమాలకు పాల్ప డుతూ స్వామివారి ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. విదేశాల్లో స్వామివారి కల్యాణం పేరిట ఆగమశాస్త్రానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పే ర్కొన్నారు. కార్లలో సీటు బెల్టు వేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను తరలించడం, ప్రైవేటు వ్యక్తుల ఇళ్లలో తిప్పడం, కల్యాణం పేరిట డబ్బులు దండుకుంటున్నారని మండిపడ్డారు. హిందూ ధర్మ ప్రచారం అంటూ దాతలను సృష్టించి కల్యాణం తేదీలను నిర్ణయించి నెలలకొద్దీ అక్కడే ఉంటూ ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. చింతపండు చోరీ విషయంలో కిందిస్థాయి ఉద్యోగులను బలి చేశారని ఆరోపించారు. ఏఈఓపై గతంలోనూ అనేక ఆరోపణలు ఉన్నాయని, రూల్స్‌కు విరుద్ధంగా ప్రమోషన్ల మీద ప్రమోషన్లు పొందారని స్పష్టం చేశారు. ఏఈఓ అధికార దు ర్వినియోగానికి పాల్పడుతున్నాడని.. బినామీల పేర్లతో టెండర్లు వేయిస్తున్నాడని, స్వర్ణగిరిపై ప్రచారం చేస్తూ ఆలయ ప్రతిష్టను దిగజారుస్తున్నారని వివరించారు. అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు చందామహేందర్, కాదూరి అచ్చయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు జైనపల్లి శ్యాంసుందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ మహేష్‌గౌడ్, యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


