రూ.500 కోట్లతో చౌటుప్పల్ అభివృద్ధి
చౌటుప్పల్ : రానున్న 25 సంవత్సరాలకు అనుగుణంగా చౌటుప్పల్‌ను అభివృద్ధి చేసేందుకు రూ.500 కోట్లతో ప్రణాళికలు రూపొందించామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం, చౌటుప్పల్, తంగడపల్లి చెరువులను గురువారం ఆయన సందర్శించి గంగమ్మ తల్లికి పూజలు చేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో చౌటుప్పల్ ముందుంటుందన్నారు. కొద్ది రోజుల్లోనే ఇక్కడ 5 లక్షల మంది నివాసం ఉండబోతున్నారని, అందుకు అనుగుణంగా మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు రూ.500 కోట్లు అవసరం అవుతాయని, ఈ విషయాన్ని ఇటీవల మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లగా.. ఆమె సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. చౌటుప్పల్ ఊర చెరువు, లక్కారం చెరువులను సుందరీకరిస్తామని చెప్పారు. ఊర చెరువు అలుగునీరు, వర్షపు నీరు దిగువకు వెళ్లేందుకు సర్వీస్‌రోడ్డు వెంట రూ.100 కోట్లతో ప్రత్యేకంగా కాలువ నిర్మాణం చేయించనున్నట్లు వెల్లడించారు. ఊరచెరువు నిండితే తలెత్తే ఉపద్రవాన్ని అందరి సహకారంతో అడ్డుకట్ట వేశామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రాంరెడ్డి, మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, ఏసీపీ పటోళ్ల మధుసూదన్‌రెడ్డి, తహసీల్దార్ వీరాభాయి, మా ర్కెట్ వైస్‌చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుర్వి నర్సింహ, నాయకులు పబ్బు రాజుగౌడ్, పాశం సంజయ్‌బాబు, ఉప్పు భద్రయ్య, మొగుదాల రమేష్, చెన్నగోని అంజయ్య, కొయ్యడ సైదులు, కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, ఎండీ హన్నుభాయ్, ఎండీ బాబాషరీఫ్, ఊడుగు శ్రీనివాస్, గుండు మల్లయ్య, బొడిగె బాలకృష్ణ, పస్తం గంగరాములు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి


