యూనిట్ మార్చ్‌ను జయప్రదం చేయాలి
సాక్షి,యాదాద్రి : సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని నిర్వహించే యూనిట్ మార్చ్‌లో అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు పిలుపునిచ్చారు. యూనిటీ మార్చ్ కార్యక్రమం అమలులో భాగంగా రాజ్యసభ సభ్యుడు శ్రీభగవత్ కరద్ గురువారం అధికారులు, మీడియా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్రను ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. కళాశాలు, పాఠశాలల్లో విద్యార్థులకు డిబేట్, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నవంబర్ 10న పాదయాత్ర, 26న మహా ఐక్యత పాదయాత్ర నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు అవసమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో యూత్ ఆఫీసర్ గంటా రాజేష్, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ధనంజయనేయులు, డీఐఈఓ రమణి, సివిల్ సప్లై జిల్లా అధికారి అరుంధతి తదితరులు పాల్గొన్నారు.


