రక్తదానం చేయండి.. ప్రాణదాతలుగా నిలవండి
యాదగిరిగుట్ట: రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని డీసీపీ అక్షాంశ్‌యాదవ్ అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఆదేశాల మేరకు గురువారం యాదగిరిగుట్టలో ఏసీపీ శ్రీనివాస్‌నాయుడు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. డీసీపీ పాల్గొని రక్తదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను నిలిపిన వారవుతారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో భాగంగా ఎంతోమంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని, వారిని స్మరించుకుంటూ ఈనెల 31వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనీలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐలు భాస్కర్, యాలాద్రి, యాదగిరిగుట్ట, రాజాపేట, ఆలేరు, మోటకొండూర్, తుర్కపల్లి, గుండాల ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ డీసీపీ అక్షాంశ్ యాదవ్


