వాగుల వద్దకు వెళ్లొద్దు : కలెక్టర్
భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్ : వర్షాలు కురుస్తున్నందున వాగుల వద్దకు వెళ్లవద్దని కలెక్టర్ హనుమంతరావు ప్రజలకు సూచించారు. బీబీనగర్ మండలం రుద్రవెళ్లి వద్ద మూసీలో వరద ప్రవాహాన్ని గురువారం ఆయన పరిశీలించారు. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లకూడదన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రాకపోకలు నిలిపివేయాలని ఆదేశించారు. అనంతరం బీబీనగర్‌లోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ట్రక్ షీట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు జరగాలని నిర్వాహకులకు సూచించారు. అదే విధంగా భూదాన్‌పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామంలో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. మాయిశ్చర్ యంత్రం పనిచేయకపోవడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మిషన్‌ను మార్చాలని ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్లు శ్యామ్ సుందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, పిలాయిపల్లి పీఏసీఎస్ సీఈఓ రెబ్బాస్ నర్సింహ తదితరులు ఉన్నారు.


