పుష్కరిణిని శుభ్రంగా ఉంచాలి
యాదగిరిగుట్ట: యాదగిరీశుడి సన్నిధికి వచ్చే భక్తుల్లో ఎక్కువ మంది పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఆసక్తి చూపుతారని, వారికి శుభ్రమైన నీటిని అందించాలని ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ శ్రీనివాసరాజు దేవస్థానం అధికారులకు సూచించారు. బుధవారం ఆయన మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయానికి వెళ్తూ యాదగిరికొండ దిగువన ఉన్న లక్ష్మీపుష్కరిణిని సందర్శించారు. పుష్కరిణిని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేస్తున్నారని అధికారులను.. స్నానాలు ఆచరించే సమయంలో ఏమైనా ఇబ్బందులున్నాయా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. పుష్కరిణిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలని, నీరు శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆయన వెంట అధికారులు వసంత్‌నాయక్, రామారావు తదితరులు ఉన్నారు.
ఫ సీఎం సీఎస్ శ్రీనివాసరాజు


