అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
చౌటుప్పల్: ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న కారణంగా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. చౌటుప్పల్‌లోని ఊరచెరువును బుధవారం ఆయన సందర్శించారు. చెరువు అలుగు ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలతో మాట్లాడి, వారికి సూచనలు చేశారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆర్డీఓ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాగులు, చెరువుల వద్ద అధికారులు గస్తీ నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రజలు అత్యవసరం అయితేనే ప్రయాణాలు సాగించాలని, వాగుల్లోకి, చెరువుల వద్దకు వెళొద్దని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రాంరెడ్డి, తహసీల్దార్ వీరాభాయి, నీటిపారుదల శాఖ ఈఈ మనోహర్, డీఈ రాజవర్థన్‌రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, సీఐ మన్మథకుమార్, ఆర్‌ఐలు సుధాకర్‌రావు, బాణాల రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ మాజీ అధ్యక్షుడు మొగుదాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.


