
ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి క్యాంపు ఆఫీస్‌లో సీఎం ఫొటో
సూర్యాపేట : సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటోలు లేకపోవడం పట్ల సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూ బుధవారం కార్యకర్తలతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లి సీఎం, మంత్రి ఫొటోలను పెట్టారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ను బీఆర్‌ఎస్ ఆఫీస్‌లా మార్చారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచినా.. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ మాజీ సీఎం కేసీఆర్ ఫొటోను అలానే ఉంచడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారిక బంగ్లా అయినందున సీఎం, జిల్లా మంత్రి ఫొటోలు తప్పనిసరిగా ఉండాలన్నారు. సీఎం, మంత్రి ఫొటోలు తొలగిస్తే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఫ కార్యకర్తలతో వెళ్లి పెట్టిన మార్కెట్ చైర్మన్