
నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
పెద్దవూర: పెద్దవూర మండలం చలకుర్తి క్యాంపు జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యాసంవత్సరానికి గాను 9వ, 11వ తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కె. శంకర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 9వ తరగతిలో ప్రవేశానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2025–26 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ ఉండాలని, 01–05–2011 నుంచి 31–07–2013 మధ్య జన్మించి ఉన్నవారు అర్హులని తెలిపారు. అదేవిధంగా 11వ తరగతిలో ప్రవేశానికి గాను ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2025–26 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతి చదువుతూ ఉండాలని, 01–06–2009 నుంచి 31–07–2011 మధ్య జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. పదవ తరగతి చదువుతున్న, నివాసం ఉంటున్న జిల్లా ఒకటే అయినప్పుడు మాత్రమే విద్యార్థి జిల్లాస్థాయి మెరిట్ కోసం పరిగణింపబడతారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న అభ్యర్థి అభ్యర్థిత్వం ఓపెన్, గ్రామీణ కోటా కింద పరిగణించబడుతుందని, పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థి అభ్యర్థిత్వం అర్బన్ కోటా కింద పరిగణించబడుతుందని పేర్కొన్నారు.
● దరఖాస్తులు జాగ్రత్తగా నింపాలని, తప్పుగా నింపితే ప్రవేశ పరీక్షలో ఎంపికై నప్పటికీ అడ్మిషన్ కాన్సిల్ అవుతుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేయటానికి ఈ నెల 23 చివరి తేదీ అని, ప్రవేశ పరీక్ష 2026 ఫిబ్రవరి 7న నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.నవోదయ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ ఫారంను నింపి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
9వ, 11వ తరగతిలో
చేరేందుకు అవకాశం