
రోడ్ల విస్తరణతోనే ప్రమాదాల నివారణ
ఫ ప్రజలు సహకరించాలి
ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
సాక్షి, యాదాద్రి: జిల్లా కేంద్రంలో ప్రమాదల నివారణకు రోడ్లను విస్తరించాల్సిన అవసరం ఉందని, ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కోరారు. సోమవారం భువనగిరిలోని తన క్యాంప్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుతో కలిసి అధికారులు, రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం అయ్యారు. ప్రాణాంతకంగా మారిన జగదేవ్‌పూర్ రోడ్డును మరింత వెడల్పు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. హన్మాన్‌వాడ రోడ్డు, హైదరాబాద్ చౌరస్తానుంచి నల్లగొండ రోడ్డును వెడల్పు చేయటంతో పాటు మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. జగ్‌దేవ్‌పూర్ చౌరస్తాలో ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో జగదేవ్‌పూర్ రోడ్డు మధ్యలో డివైడర్లు, ఇరువైపులా జాలీలు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. జగదేవ్‌పూర్ ఫ్లై ఓవర్ మరమ్మతులకు రూ.75 లక్షలు మంజూరయ్యాయని, వెంటనే పనులు ప్రారంభించాలని పేర్కొన్నారు. సమావేశంలో పాల్గొన్న పలువురు ఆర్టీసీ బస్టాండ్ అద్దె మడిగెలు, బ్యాంకు, రిలయన్స్‌మాల్, రైతుబజార్, రాఘవేంద్ర హో టల్ పార్కింగ్ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సెల్లార్లను పార్కింగ్‌కు ఉపయో గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామలింగం, సీఐ రమేష్, ప్రజాసంఘాల నాయకులు భట్టు రామచంద్రయ్య, కుక్కదువ్వు సోమయ్య, బీసుకుంట్ల సత్యనారాయణ, బట్టుపల్లి అనురాధ, మెరుగు మధు, దిడ్డి బాలాజీ, ఏశాల అశోక్, ఎండీ ఇమ్రాన్, ఆగేశ్వర్‌రావు, భువనగిరి వెంకటరమణ, మాటూరి అశోక్ తదితరులు పాల్గొన్నారు.