
స్వాతంత్య్ర సమరయోధుడు నర్సయ్య కన్నుమూత
పెన్‌పహాడ్: మండల పరిధిలోని మహ్మదాపురం గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు గుండు నర్సయ్య(93) అనా రోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతిచెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు సంతానం. నర్సయ్య మృతదేహాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూముల సురేష్‌రావు, భూక్య సందీప్‌రాథోడ్, మామిడి కరుణాకర్, కిన్నెర ఉప్పలయ్య, తదితరులు నివాళులర్పించారు.
కౌలు రైతు ఆత్మహత్య
కట్టంగూర్: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన మాతంగి యాదయ్య(57) తనకున్న ఎకరం భూమితో పాటు మరో ఆరెకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగుచేశాడు. రెండు సంవత్సరాలుగా కాలం కలిసి రాక పంట దిగుబడి రాకపోవడంతో అప్పుల పాలయ్యాడు. ప్రస్తుతం పత్తి చేను ఎండిపోవటంతో మనోవేదనకు గురయ్యాడు. వారం రోజులుగా ఇంట్లో కుటుంబ సభ్యులతో అప్పులు పెరిగిపోయాయని చెప్పాడు. మంగళవారం ఇంటి వరండాలోని ఐరన్ పైపునకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం యాదయ్య భార్య ఇంటికి వచ్చి చూసేసరికి ఉరికి వేలాడుతూ కనిపించాడు. రూ.6 లక్షలు అప్పు చేసినట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి కుమారుడు మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ రవీందర్ తెలిపారు.

స్వాతంత్య్ర సమరయోధుడు నర్సయ్య కన్నుమూత