ఆదాయానికి గండి..! | - | Sakshi
Sakshi News home page

ఆదాయానికి గండి..!

Jul 15 2025 12:07 PM | Updated on Jul 15 2025 12:07 PM

ఆదాయానికి గండి..!

ఆదాయానికి గండి..!

అనుమతి ఒక్క ఫ్లోర్‌కు.. అంతకుమించి నిర్మాణాలు
దివ్యాంగులకు ఆర్థిక భరోసా

మున్సిపాలిటీ వారీగా అసెస్‌మెంట్‌లు

● జిల్లా కేంద్రం వేగంగా విస్తరిస్తుండటంతో అదే స్థాయిలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. రికార్డుల ప్రకారం కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ 14,885 అసెస్‌మెంట్‌లు ఉండగా రూ.8.85 కోట్ల ఆస్తిపన్ను డిమాండ్‌ ఉంది. ఇందిరమ్మ కాలనీ, సింగనగూడెం, హైవే పక్కన ఉన్న ఇందిరమ్మ కాలనీలో నంబర్లు కేటాయించని నిర్మాణాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.

● మోత్కూర్‌లో 5,089 నిర్మాణాలు ఉన్నాయి. ఇందులో 4,921 ఇళ్లకు మాత్రమే నంబర్లు కేటాయించారు.168 నిర్మాణాల అసెస్‌మెంట్‌ జరగలేదు.వీటితో పాటు కొత్తగా చేపట్టిన నిర్మాణాలు రికార్డులకెక్కలేదు.

● చౌటుప్పల్‌లో 8,528 నిర్మాణాలు ఉన్నాయి. వీటిలో చాలావరకు అసెస్‌మెంట్‌ చేయలేదు. మరోవైపు కొత్త నిర్మాణాలు సాగుతున్నాయి.

● భూదాన్‌పోచంపల్లిలో 5,115 నిర్మాణాలకు గాను 4,973 అసెస్‌మెంట్లను అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఆస్తిపన్ను నిర్ణయించారు. కొత్తగా వెలిసిన 192 నిర్మాణాలకు ఇంకా అసెస్‌మెంట్‌ చేయకపోవడంతో మున్సిపాలిటీ ఆదాయం కోల్పోతోంది.

● ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో 4,777 నిర్మాణాలు రికార్డుల్లో నమోదయ్యాయి. ఇంకా 450 నిర్మాణాలకు సరైన డాక్యుమెంట్లు లేవని నంబర్లు కేటాయించలేదు.

సాక్షి, యాదాద్రి : మున్సిపాలిటీలకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్ను. క్షేత్రస్థాయిలో సిబ్బంది సక్రమంగా అసెస్‌మెంట్‌ చేపడితేనే ఆస్తిపన్ను ఖరారవుతుంది. కానీ, కొందరు ఉద్యోగుల నిర్లక్ష్యంతో అసెస్‌ మెంట్‌ ప్రక్రియలో పారదర్శకత ఉండడం లేదు. నిర్మాణాలు పూర్తికాగానే కొలతల ఆధారంగా పన్ను నిర్ణయించి వసూలు చేయకపోవడం, కొన్ని భవనాలను ఏళ్లుగా రికార్డుల్లో నమోదు చేయకపోవడం, మరికొన్నింటికి మ్యానవల్‌ నంబర్లు మంజూరు చేసినా ఆన్‌లైన్‌ చేయకపోవడం వంటి కారణాలతో మున్సిపల్‌ శాఖ ఏటా రూ.కోట్లలో ఆదాయం కోల్పోతోంది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.

అడిగేవారేరి?

భువనగిరి, చౌటుప్పల్‌, పోచంపల్లి మున్సిపాలిటీలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్నాయి. భువనగిరి పట్టణ పరిధిలో కమర్షియల్‌ స్థలాల ధర గజం రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు పలుకుతోంది. కమర్షియల్‌ స్థలంలో భవన నిర్మాణ అనుమతి పొందాలంటే రూ.లక్షల్లో ఫీజు ఉంటుంది. కానీ, కొందరు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతుండగా మరికొందరు ఒకటి, రెండు అంతస్తులకు పర్మిషన్‌ తీసుకొని అపైనే నిర్మిస్తున్నారు. ఇందులో గ్రౌండ్‌ ఫ్లోర్‌ మొదలుకొని బహుళ అంతస్తుల వరకు నిర్మాణాలున్నాయి. మరోవైపు అధికారులు అక్రమ నిర్మాణాలను గుర్తించకపోవడం, పూర్తయిన నిర్మాణాలకు అసెస్‌మెంట్‌ చేయకపోవడం వల్ల ఆస్తిపన్నుకు గండిపడుతోంది. ఈ విధంగా మున్సిపాలిటీలు రెండు విధాలా ఆదాయం కోల్పోతున్నాయి.

అనుమతుల జారీ ఇలా..

హెచ్‌ఎండీ పరిధిలో బహుళ అంతస్తులతో కూడిన వాణిజ్య భవనాలు, 1,200 గజాల పైబడిన రెసిడెన్షియల్‌ భవన నిర్మాణాలకు హెచ్‌ఎండీఏ జారీ చేస్తుంది. 50 నుంచి 1200 గజాల వరకు రెసిడెన్షియల్‌ నిర్మాణాలకు మున్సిపాలిటీ పర్మిషన్‌ ఇస్తుంది. స్థలాన్ని బట్టి అంతస్తుల నిర్మాణానికి అనుమతి ఇస్తుంది. హెచ్‌ఎండీఏ అనుతులు జారీ చేయడంతో వచ్చిన ఫీజులో కొంత మొత్తం మున్సిపాలిటీకి బదిలీ చేస్తారు. గత ప్రభుత్వం అదనపు అంతస్తులను క్రమబద్ధీకరించడం, ఫెనాల్టీ వసూలు చేసేది.. వీటిని నూతన మున్సిపల్‌ చట్టంలో తొలగించడం వల్ల ఆదాయం కోల్పోతున్నాయి.

ఫ కమర్షియల్‌కు బదులుగా రెసిడెన్షియల్‌గా రికార్డుల్లో నమోదు

ఫ నంబర్లు కేటాయించనినిర్మాణాలు వేలల్లో..

ఫ నోటీసులతోనే సరిపెడుతున్న అధికారులు

ఫ ఏటా రూ.కోట్లలో ఆదాయం కోల్పోతున్న మున్సిపాలిటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement