
రేడియోతోనే కాలక్షేపం
టీవీ చూడాలనిపించదు
ఇంట్లో టీవీ ఉన్నప్పటికి నాకు మాత్రం టీవీ చూడాలనిపించదు. ఎక్కువగా రేడియోలో ప్రసారమయ్యే కార్యక్రమాలనే వింటుంటాను. నాకు పెళ్లిలో కూడా రేడియో ఇవ్వలేదు. ఎందుకంటే అప్పటికే మా ఇంట్లో రేడియో ఉండడంతో రేడియో ఇవ్వమని అడగలేదు. ప్రస్తుతం నా వయస్సు 60సంవత్సరాలకు పైబడినా ఇంకా రేడియోను వాడుతుంటాను.
– చింతకుంట్ల సుదర్శన్‌రెడ్డి
తిప్పర్తి: 1990ల్లో ప్రసార సాధనాలు లేని సమయంలో వార్తలు వినడానికి గ్రామాల్లో ధనికుల ఇళ్లలో ఎక్కువగా రేడియోలు ఉండేవి. కాలక్రమేణా అవి కనుమరుగై టీవీలు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు వచ్చాయి. కానీ నేటి తరంలో కూడా రేడియోను వాడుతున్నాడు తిప్పర్తి మండలం సిలార్‌మియాగూడెం గ్రామానికి చెందిన రైతు చింతకుంట్ల సుదర్శన్‌రెడ్డి. తనకు ఊహా తెలిసినప్పటి నుంచి రేడియో వాడుతున్నానని, 50 ఏళ్లుగా రేడియో వింటున్నా.. ఇప్పటికీ తనకు ఇంకా ఆసక్తి తగ్గలేదని సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. పొలం దగ్గర వెళ్లినప్పుడు రేడియోను కూడా వెంట తీసుకెళ్తానని, అందులో పాటలు, జానపద గేయాలు, బుర్రకథలు, వ్యసాయ సమాచారం, అన్నదాతల సందేహాలను వింటానని ఆయన చెబుతున్నారు. గతంలో పాత రేడియో ఉండేదని, ప్రస్తుతం కొత్త రకం రేడియో తీసుకున్నానని వివరించారు. తన తండ్రి దగ్గర ఉన్న రేడియోను తనకు 30 సంవత్సరాలు వచ్చే వరకు వాడానని, ఆ తర్వాత ఆ రేడియో రిపేర్‌కు రావడంతో మార్చానని, ఇప్పటి వరకు ఐదు రేడియోలను వాడానని పేర్కొన్నారు.
ఫ 50 సంవత్సరాలుగా
రేడియో వాడుతున్న రైతు