5 లక్షల రేషన్‌ కార్డులు అందజేస్తాం | - | Sakshi
Sakshi News home page

5 లక్షల రేషన్‌ కార్డులు అందజేస్తాం

Jul 12 2025 6:53 AM | Updated on Jul 12 2025 6:53 AM

5 లక్

5 లక్షల రేషన్‌ కార్డులు అందజేస్తాం

పౌర సరఫరాలు, ఇరిగేషన్‌ శాఖ

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

జిల్లా ఇన్‌చార్జి మంత్రి

లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి తిరుమలగిరిలో సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన

తిరుమలగిరి (తుంగతుర్తి) : నూతనంగా 5 లక్షల రేషన్‌ కార్డులు అందజేయనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 14న ముఖ్యమంత్రి చేతుల మీదుగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో నూతన రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభిస్తామని చెప్పారు. శుక్రవారం తిరుమలగిరిలో సీఎం సభ ఏర్పాట్లను ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్‌కుమార్‌, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో గతంలో 2.80 కోట్ల మందికి రేషన్‌ అందేదని, ప్రస్తుతం 3.10 కోట్ల మందికి సన్న బి య్యం అందిస్తున్నట్లు చెప్పారు. భారత దేశంలోనే 281 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేసి ప్రథమ స్థానం పొందామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సన్న ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా 1.04 లక్షల మంది ఎన్యుమరేటర్ల ద్వారా బీసీ కుల గణన చేశామని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రి ఉత్తమ్‌ చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణ చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 95 లక్షల కుటుంబాలకు రేషన్‌ కార్డులు ఇచ్చినట్లు తెలిపారు. తిరుమలగిరిలో ఈ నెల 14న సీఎం చేతుల మీదుగా కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు, అదేరోజు జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు.

అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యం : మంత్రి అడ్లూరి

ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు. జూలై 14న జరిగే నూతన రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌, సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌, జిల్లా ఎస్పీ కె.నరసింహ, రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్‌, ఆర్థిక సంఘం కమిషన్‌ సభ్యుడు సుధీర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, అదనపు కలెక్టర్‌ రాంబాబు, డీఆర్డీఓ వీవీ.అప్పారావు, డీఎస్‌ఓ సతీష్‌కుమార్‌, ఆర్డీఓ వేణుమాధవరావు, తహసీల్దార్‌ హరిప్రసాద్‌, కాంగ్రెస్‌ నాయకులు సర్వోత్తమ్‌రెడ్డి, వేణారెడ్డి, గుడిపాటి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆర్‌ఎంపీల సమస్యలు పరిష్కరించాలని వినతి

తిరుమలగిరి (తుంగతుర్తి) : గ్రామీణ వైద్యులుగా శిక్షణ పూర్తిచేసుకున్న వారిని ప్రభుత్వం గుర్తించాలని జిల్లా ఆర్‌ఎంపీ, బీఎంపీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శుక్రవారం తిరుమలగిరికి వచ్చిన రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి లక్ష్మణ్‌కుమార్‌లకు వినతి పత్రం అందజేశారు. వారిలో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కుప్పాల లక్ష్మీనర్సయ్య, కోశాధికారి లక్ష్మణ్‌గౌడ్‌, అధికార ప్రతినిధి వెంకన్న, జోనల్‌ ఇన్‌చార్జ్‌ రామచంద్రన్‌గౌడ్‌, వెంకన్న, నాగరాజు, శేఖర్‌, వెంకటేశ్వర్లు, రవి, లక్ష్మి, మహేందర్‌ ఉన్నారు.

5 లక్షల రేషన్‌ కార్డులు అందజేస్తాం1
1/1

5 లక్షల రేషన్‌ కార్డులు అందజేస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement