
గుట్ట ఆలయ సన్నిధిలో వనమహోత్సవం
యాదగిరిగుట్ట: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలోని పలు ప్రాంతాల్లో దేవస్థానం, ఎస్‌పీఎఫ్ అధికారులు, సిబ్బంది మొక్కలు నాటారు. కల్యాణకట్ట, అన్నప్రసాద భవనం పరిసరాల్లో పనస, కదంబ, వేప, ఉసిరి తదితర మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్‌పీఎఫ్ ఆర్‌ఐ శేషగిరారావు, ఆలయ అధికారులు గజివెల్లి రమేష్‌బాబు, అశ్విని తదితరులు పాల్గొన్నారు.
పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
భువనగిరి : పోషకాహారంతో తీసుకోవడం ద్వారా గర్భిణులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని డీఎంహెచ్‌ఓ మనోహర్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలో రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి ఆధ్వర్యంలో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల తల్లితో పాటు పుట్టుబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని గర్భిణులకు పోషకాహారం కిట్లు అందజేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకురావాలని కోరారు. రోటరీక్లబ్ నిర్వాహకులను డీఎంహెచ్‌ఓ అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ యశోద, అర్బన్ పీహెచ్‌సీ వైద్యులు నిరోషా, రోటరీ క్లబ్ అధ్యక్షుడు పలుగుల ఆగేశ్వర్‌రావు, కార్యదర్శి తవిటి వెంకటనారాయణతో పాటు పి.రమేష్‌బాబు, సాయికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రొబేషనరీ ఎస్‌ఐలకు పోస్టింగ్
భువనగిరిటౌన్ : 11 మంది ప్రొబేషనరీ ఎస్‌ఐలకు పోస్టింగ్ ఇస్తూ రాచకొండ సీపీ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌కు వీరబోయిన సైదులు, ఎన్.రూపశ్రీ, భువనగిరి టౌన్ ఉప్పల నరేష్, భువనగిరి రూరల్ ఓరుగంటి సంధ్య, కె.శివశంకర్‌రెడ్డి, ఆలేరు ఎన్.వినయ్, మోత్కూరు కె.సతీష్, చౌటుప్పల్ కె.ఉపేందర్‌రెడ్డి, అంజయ్‌భార్గవ్, బీబీనగర్ గుజ్జ విజయ, పోచంపల్లికి కె.లీలను కేటాయించారు.
బదిలీలు
హైదరాబాద్ పహాడిషరీప్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు భువనగిరి సీసీఎస్‌కు, యాదగిరిగుట్ట ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్ ఎస్‌బీనగర్ సీసీఎస్, రామన్నపేట ఎస్‌హెచ్‌ఓ మల్లయ్య బీఆర్‌పేట పీఎస్, బీఆర్‌పేట ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న నాగరాజును రామన్నపేటకు బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రతి దరఖాస్తునూ
పరిష్కరించాలి
సాక్షి,యాదాద్రి : రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి సమస్యకు పరి ష్కారం చూపాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో తహసీల్దార్లతో సమావేశం ఏర్పాటు చేశారు. దరఖా స్తుల పరిష్కారంపై సమీక్షించారు. దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేసి ఆగస్టు 15 నాటికి పూర్తిగా పరిష్కరించాలని కోరారు. అదే విధంగా చేయూత పథకంపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు, పోస్టల్ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఇందిరమ్మ ఇళ్లపై స మీక్షించారు. ఇందరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని, ఇళ్ల నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కారణాలు తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉంటే మహిళా సంఘాల ద్వారా లోన్లు ఇప్పించి పనులు మొదలు చేయించాలన్నారు. స్వచ్ఛభారత్ మిషన్, స్వచ్చ సర్వేక్షణ్, వనమహోత్సవం కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు పాల్గొన్నారు.