
ముఖ హాజరు వేయాల్సిందే..
లబ్ధిదారుల వివరాలన్నీ
యాప్‌లోనే నమోదు
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫేస్ రికగ్నేషన్ హాజరుశాతం నమోదు చేసి సరుకులు పంపిణీ చేస్తున్నాం. ప్రస్తుతం మూడేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారం అందజేస్తున్నాం. లబ్ధిదారుల వివరాలన్నీ యాప్‌లోనే నమోదు చేస్తున్నాం.
–స్వరాజ్యం సీడీపీఓ, ఆలేరు
ఆలేరురూరల్: అంగన్‌వాడీ కేంద్రాల సేవల్లో పారదర్శకత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సాంకేతికతను వినియోగిస్తోంది. ఇప్పటి వరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం, ఇతర సేవలన్నింటినీ రికార్డుల్లో నమోదు చేసేవారు. గుడ్లు, బాలామృతం, ఇతర పోషకాహార పదార్థాలు సరిగా ఆందడం లేదని, తమ సంతకాలను ఫోర్జరీ చేస్తున్నారని లబ్ధిదారుల నుంచి ఆరోపణలున్నాయి. సేవల్లో పాదర్శకత ఉండేలా ఫేస్ రికగ్నేషన్ విధానం తప్పనిసరి చేసింది. కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ విధానం అమలు చేస్తున్నారు.
901 అంగన్‌వాడీ కేంద్రాలు
జిల్లా వ్యాప్తంగా 901 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు 49,023 మంది ఉన్నారు. వీరందరికీ జూలై 3నుంచి ఫేస్ రికగ్నేషన్ హాజరు ద్వారానే సరుకులు పంపిణీ చేస్తున్నారు.ఫేస్ రికగ్నేషన్ ద్వారా యాప్‌లో లబ్ధిదారు ఫొటోతో సహా నమోదవుతుంది. లబ్ధిదారులకు పోషకాహారం పంపిణీపై రాష్ట్ర స్థాయి అధికారులకు పర్యవేక్షణ సులువుకానుంది.
ప్రస్తుతం చిన్నారులకే వర్తింపు..
ప్రస్తుతం యాప్ ద్వారా 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు వయసు గల పిల్లలకు బాలామృతం, గుండ్లు, ఇతర పోషకాహార పదార్థాలు పంపిణీ చేస్తున్నారు. ఇది విజయవంతంమైతే మిగతా లబ్ధిదారులకు కూడా యాప్‌లో వివరాలు నమోదు చేసుకుని సరుకులు అందజేస్తామని అంగన్‌వాడీ టీచర్లు చెబుతున్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫేస్ రికగ్నేషన్
ఫ పౌష్టికాహారం పంపిణీలో పాదర్శకత కోసం నూతన విధానం
ఫ జిల్లా వ్యాప్తంగా
901 కేంద్రాల్లో అమలు
అంగన్‌వాడీ కేంద్రాలు 901
మూడేళ్లలోపు చిన్నారులు 21,070
3–6 ఏళ్లలోపు చిన్నారులు 19,048
గర్భిణులు 4,121
బాలింతలు 3,883