
మూడేళ్లు కష్టపడితే 30 ఏళ్లు ఆదాయం
ఆలేరురూరల్: ఆయిల్‌పామ్ సాగు చేయడం వల్ల అధిక ప్రయోజనాలు ఉంటాయని, మూడేళ్లు కష్టపడితే 30 ఏళ్ల పాటు ఆదాయం లభిస్తుందని రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. గురువారం ఆలేరు మండలం కొలనుపాకలో రైతులు నర్రా నారాయణరెడ్డి, సీతారాంరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన ఆయిల్‌పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ హనుమంతరావుతో కలిసి ఆయిల్‌పామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎకరాకు రూ.1.5 లక్షల నుంచి రూ.2లక్షల వరకు ఆదాయం పొందవచ్చన్నారు. ఆయిల్‌పామ్ సాగు చేసిన రైతులకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందజేస్తున్నారు. సూక్ష్మ సేద్య పరికరాలను ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బీసీలకు 90 శాతం, ఓసీ రైతులకు 80 శాతం రాయితీపై ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, మదర్ డైయిరీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, ఆయిల్‌ఫెడ్ ఓఎస్‌డీ కరణ్, ఆయిల్‌ఫెడ్ స్పెషల్ ఆఫీసర్ తిరుమలేష్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, జిల్లా ఉద్యాన అధికారి సుభాషిణి, ఏడీఏ పద్మావతి, హార్టికల్చర్ ఆఫీసర్లు స్రవంతి, స్నేహిత, ఎంఏఓ శ్రీనివాస్, ఏఈఓలు, ఆయిల్‌ఫెడ్ జిల్లా మేనేజర్ ఖాజా మొయినొద్దీన్, డిప్యూటీ మేనేజర్ ప్రవీణ్, ఫీల్డ్ ఆఫీసర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఫ ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ప్రభుత్వ విప్ అయిలయ్య