
మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
భువనగిరిటౌన్ : భువనగిరిని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో వివిధ వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భువనగిరి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కావాలని సీఎం రేవంత్‌రెడ్డిని అడిగిన వెంటనే హెచ్‌ఎండీఏ నిధులు రూ. 56 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. ఇందులో రూ.13కోట్లతో భువనగిరి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.నల్లగొండ, హైదరాబాద్ రోడ్ల విస్తరణతో పాటు కూడళ్లను అభివృద్ధి చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవైస్‌చిస్తీ, టీపీసీసీ సభ్యులు తంగళ్లపల్లి రవికుమార్, నాయకులు పోత్నక్ ప్రమోద్‌కుమార్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, బర్రె జహంగీర్, మజహార్, కూర వెంకటేష్, గుర్రాల శ్రీనివాస్, సలావుద్దీన్ పాల్గొన్నారు.
ఫ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి