
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
ఫ న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి మాధవీలత
తుర్కపల్లి: ప్రతిఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రిన్సిపల్ సీనియర్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వి.మాధవీలత అన్నారు. తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. చట్టాలపై అవగాహన క్పలించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చట్ట పరిరక్షణ మద్దతు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది నాగరాజు, పారా లీగల్ వలంటీర్లు హిరాలాల్, మౌనిక, సబ్ ఇన్‌స్పెక్టర్ తక్కూద్దీన్ తదితరులు పాల్గొన్నారు.