
సాగర్‌ను సందర్శించిన విదేశీయులు
నాగార్జునసాగర్: భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పర్యావరణ పరిరక్షణ శిక్షణ మరియు పరిశోధన సంస్థలో శిక్షణ పొందుతున్న 24 దేశాలకు చెందిన 37మంది మంగళవారం నాగార్జునసాగర్‌ను సందర్శించారు. పర్యావరణం, అభివృద్ధి, నీటి సంరక్షణ తదితర అంశాల్లో శిక్షణ పొందుతున్న వీరు సాగర్ జలాశయం, ప్రధాన డ్యాం, జల విద్యుదుత్పాదన కేంద్రాన్ని పరిశీలించారు. సాగర్ ప్రాజెక్టు నిర్మాణం, జలవనరుల వినియోగం తదితర అంశాల గురించి సాగనీటి శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట సాగునీటి శాఖ అధికారులతో పాటు స్థానిక పోలీసులు, డ్యాం ప్రత్యేక రక్షణ దళం((ఎస్‌పీఎఫ్) ఉన్నారు.