నల్లగొండ: బైక్‌లు చోరీ చేస్తున్న దొంగను మంగళవారం అరెస్ట్ చేసినట్లు నల్లగొండ టూటౌన్ ఎస్‌ఐ సైదులు తెలిపారు. నిడమనూరు మండలం బొక్కముంతలపాడ్ గ్రామానికి చెందిన కొండేటి సంతోష్‌కుమార్ మద్యానికి బానిసై బైక్‌లు చోరీ చేస్తున్నాడు. గత నెల 25న గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన షేక్ మహబూబ్‌వలీ తన బైక్‌ను నల్లగొండ రైల్వే స్టేషన్‌లో పార్కింగ్ చేయగా చోరీకి గురైంది. బాధితుడు నల్ల గొండ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మంగళవారం ఉదయం నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని పానగల్లు బైపాస్ రోడ్డులో నల్లగొండ టూటౌన్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. సంతోష్‌కుమార్, మరో బాలుడు కలిసి దొంగిలించిన బైక్‌పై అనుమానాస్పదంగా వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించి హాలియాలో చోరీ చేసిన 2 బైక్‌లు, మిర్యాలగూడ, వాడపల్లి, నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ మరో మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకున్న టూటౌన్ ఎస్‌ఐ సైదులు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ఫ పోలీసుల అదుపులో నిందితుడు