
‘భద్రాచలం’ ఈఓపై దాడిని ఖండిస్తున్నాం
యాదగిరిగుట్ట: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ ఈఓపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రధాన దేవాలయాల ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజివెల్లి రమేష్‌బాబు అన్నారు. భద్రాచలం ఆలయ ఈఓపై జరిగిన దాడికి నిరసనగా యాదగిరిగుట్ట వైకుంఠద్వారం వద్ద మంగళవారం నల్లబ్యాడ్జీలతో యాదగిరిగుట్ట ఆలయ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలోని అల్లూరి జిల్లా పురుషోత్తట్నం గ్రామంలో గల భద్రాచలం ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఈఓ రమాదేవి, అర్చకులు, సిబ్బందిపై స్థానికులు దాడి చేయడం బాధాకరమన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. దేవలయాల భూములను రక్షించేందుకు ఆలయ ఉద్యోగులు ముందుంటారని, ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఆలయ ఉద్యోగులు గజివెల్లి రఘు, నవీన్‌కుమార్, ముద్దసాని నరేష్, దయానంద్, అర్చకులు పాల్గొన్నారు.
ఫ ప్రధాన దేవాలయాల ఉద్యోగుల
జేఏసీ రాష్ట్ర చైర్మన్ రమేష్‌బాబు
ఫ యాదగిరిగుట్ట వైకుంఠద్వారం
వద్ద ఆలయ ఉద్యోగుల నిరసన