
ప్రసాద వితరణకు ఈవో రూ.లక్ష విరాళం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు ఉచితంగా ప్రసాద వితరణ కోసం దేవస్థానం ఈవో వెంకట్రావ్ తన జీతంలో నుంచి రూ.లక్షను విరాళంగా మంగళవారం అందజేశారు. ప్రతి నెలా తన జీతంలో నుంచి రూ.లక్ష విరాళంగా ఇస్తానని ఇప్పటికే ఈవో ప్రకటించారు. ఆ మేరకు గత నెల రూ.లక్ష తన జీతంలో నుంచి, మరో రూ.2లక్షలు తన పిల్లల పేరుతో ఆలయానికి అందించారు. ఇందులో భాగంగానే ఈ నెల జీతంలో నుంచి రూ.లక్షను విరాళంగా డోనర్ సెల్ వద్ద అందజేశారు. ప్రతి ఆదివారం నుంచి శుక్రవారం వరకు భక్తులకు ఉచితంగా పులిహోర ప్రసాదం, శనివారం లడ్డూ ప్రసాదం అందజేస్తారు. దీనికి ఈ నగదును వినియోగించనున్నట్లు వెల్లడించారు. దాతలు తమకు నచ్చిన రోజుల్లో, తిఽథులలో, నిత్యం వారి పేరున ప్రసాద వితరణ కోసం విరాళాలు ఇవ్వాలని ఆలయ ఈవో కోరారు.
ఫ తన జీతం నుంచి ప్రతి నెలా
కేటాయిస్తున్న వెంకట్రావ్