
ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య
భువనగిరి: ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందని ఇంటర్ బోర్డు జాయింట్ సెక్రటరీ భీంసింగ్ అన్నారు. మంగళవారం భువనగిరిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను సందర్శించారు. ఆయన వెంట కశాశాల ప్రిన్సిపాల్ పాపిరెడ్డి, అధ్యాపకులు ఉన్నారు.
మొక్కలు నాటి సంరక్షించాలి
యాదగిరిగుట్ట: ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని ఇంటర్మీడియట్ బోర్డు జాయింట్ సెక్రటరీ భీమ్ సింగ్ అన్నారు. మంగళవారం యాదగిరిగుట్ట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్‌సీసీ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందంతో సమావేశం ఏర్పాటు చేశారు. పదో తరగతి సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన విద్యార్థులను కళాశాలలో అడ్మిషన్ పొందే విధంగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మంజుల, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రాంబాబు పాల్గొన్నారు.