
ఎంపీటీసీ సా్థనాలు 178
బుధవారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2025
సాక్షి, యాదాద్రి : జిల్లాలో ఒక ఎంపీటీసీ స్థానం పెరిగింది. గతంలో 17 మండలాల్లో 177 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, కొత్తగా ఏర్పాటు చేసిన ఎంపీటీసీ స్థానంతో 178 కి చేరింది. ప్రతి మండలానికి ఐదు ఎంపీటీసీ స్థానాలకు తగ్గకుండా మండల ప్రాదేశిక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఈమేరకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో ముసాయిదా జాబితా ప్రచురించారు. మోత్కూరు మండలంలో గతంలో ఉన్న నాలుగు ఎంపీటీసీ స్థానాలకు అదనంగా పాటిమట్ల ఎంపీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేశారు.
పాటిమట్ల కొత్త ఎంపీటీసీ స్థానం
మోత్కూరు మండలంలో గతంలో నాలుగు ఎంపీటీసీ స్థానాలు దాచారం, పొడిచేడు, దత్తప్పగూడెం, ముసిపట్ల ఉండేవి. వీటిలోంచి దాచారం, పాటిమట్ల, సదర్శపురం మూడు గ్రామాలు కలిపి ఉండేవి. ప్రస్తుతం పాటిమట్ల సదర్శపురం రెండు గ్రామాలు కలిపి ఒక ఎంపీటీసీ స్థానంగా ఏర్పాటు చేశారు. దీంతో నాలుగు నుంచి ఐదు ఎంపీటీసీ స్థానాలు అయ్యాయి. ఆలేరు మున్సిపాలిటీ నుంచి విడిపోయిన నూతన గ్రామ పంచాయతీ అయిన సాయిగూడెంను కొల్లూరు ఎంపీటీసీ పరిధిలో విలీనం చేశారు. భూదాన్‌పోచంపల్లి మండలంలో సాయినగర్ గ్రామ పంచాయతీ దేశ్‌ముఖి ఎంపీటీసీ స్థానం పరిధిలో ఉండేది. ప్రస్తుతం సాయినగర్ గ్రామ పంచాయతీని రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఈమేరకు ముసాయిదా తయారు చేశారు.
అత్యధికంగా వలిగొండలో
17 ఎంపీటీసీ స్థానాలు
2019 ఎన్నికలతో పోలిస్తే జిల్లాలో 177 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ప్రస్తుతం ఒకటి పెరగడంతో అవి 178కి చేరుకున్నాయి. జిల్లాలో అత్యధికంగా వలిగొండలో 17 ఎంపీటీసీ స్థానాలు, రామన్నపేటలో 16, భువనగిరి 13, బీబీనగర్‌లో 14 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. మిగిలిన వాటిలో 12 నుంచి 5కు తగ్గకుండా ఉన్నాయి.
దాడిని ఖండిస్తున్నాం
భద్రాచలం శ్రీసీతారామ ఆలయ ఈఓపై దాడిని ఖండిస్తున్నట్లు యాదగిరిగుట్ట ఆలయ ఉద్యోగులు నిరసన తెలిపారు.
- 8లో
న్యూస్‌రీల్
ఫ జిల్లాలో పెరిగిన మండల ప్రాదేశిక నియోజకవర్గం
ఫ పాటిమట్ల, సదర్శపురం
రెండు గ్రామాలు కలిపి పాటిమట్ల
ఎంపీటీసీ స్థానంగా ఏర్పాటు
ఫ ఎంపీటీసీ స్థానాల పునర్విభజనకు
విడుదలైన షెడ్యూల్
ఫ నేడు ముగియనున్న అభ్యంతరాల
స్వీకరణ.. 10, 11న పరిష్కారం
ఫ 12న తుది జాబితా ప్రకటన
5 ఎంపీటీసీ స్థానాలకు తగ్గకుండా..
ప్రతి మండలంలో 5 ఎంపీటీసీ స్థానాలకు తగ్గకుండా ఎంపీటీసి నియోజక వర్గాల పునర్‌వ్యవస్థీకరించేందుకు పంచాయతీరాజ్ శాఖ సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. అందులో భాగంగా జిల్లా పరిషత్ అధికారులు మంగళవారం అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో ఎంపీటీసీ నియోజకవర్గాల ముసాయిదా జాబితా ప్రకటించారు. 8, 9 తేదీల్లో ప్రకటించిన జాబితాలో ఎలాంటి అభ్యంతరాలున్నా సమర్పించేందుకు అవకాశం కల్పించారు. వచ్చిన అభ్యంతరాలన్నింటిని 10, 11వ తేదీల్లో పరిష్కరించనున్నారు. 12వ తేదీన ఎంపీటీసీ నియోజకవర్గాల తుది జాబితాను ప్రకటించనున్నారు.