
14న అప్రెంటిస్‌షిప్ మేళా
ఆలేరు: ఆలేరులోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లో ఈనెల 14న అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ హరికృష్ణ మంగళవారం తెలిపారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల మేళా కొనసాగుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. 18 ఏళ్లు నిండి, ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతోపాటు జీరాక్స్ ప్రతులో మేళాకు హాజరుకావాలని కోరారు. వివరాలకు 98668 43920ను సంప్రదించాలని పేర్కొన్నారు.
స్కీంలను సద్వినియోగం చేసుకోవాలి
బీబీనగర్: ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యుల అభివృద్ధికి కొత్తగా తీసుకువచ్చిన స్కీంలను సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావు అన్నారు. మంగళవారం బీబీనగర్ మండల సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం బీబీనగర్ పీహెచ్‌సీని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అదేవిధంగా బ్రహ్మణపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, ఏపీఓ చండీరాణి, మండల సమాఖ్య అధ్యక్షురాలు ప్రజావాణి, కార్యదర్శి బాలమణి, ఏపీఎం శ్రీనివాస్ ఉన్నారు.
‘ప్రసాద్ 2.0’కు ఎంపికై న సోమేశ్వరాలయం
ఆలేరురూరల్: ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని శ్రీసోమేశ్వర స్వామి ఆలయం ప్రసాద్ 2.0 పథకానికి ఎంపికై ంది. ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సంబంధిత శాఖకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. జాతీయ రహదారి 163 సమీపంలో ఈ ఆలయం ఉండడంతో పర్యాటక వసతులు, శిల్పాల పరిరక్షణ, సౌందర్యీకరణ, డిజిటల్ మ్యూజియం అభివృద్ధి వంటి అంశాలకు నిధులు లభించనున్నాయి.
దేశవ్యాప్త సమ్మెను
జయప్రదం చేయాలి
భువనగిరి : ప్రధాని మోదీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం భువనగిరిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏశాల అశోక్, పట్టణ, మండల కార్యదర్శులు లక్ష్మయ్య, రమేష్ పాల్గొన్నారు.