
భూ భారతి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచొద్దు
యాదగిరిగుట్ట రూరల్: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ భారతి దరఖాస్తులను పెండింగ్ లేకుండా పూర్తిచేయాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. తహసీల్దార్ లాగిన్‌లో ఉన్న అప్లికేషన్లను వెంటనే పరిష్కరించాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ఎంపీడీఓతో సమీక్ష నిర్వహించారు. ఇళ్లు మంజూరై, కట్టుకోని పరిస్థితుల్లో ఉన్నవారికి, మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించి, ఇళ్లు కట్టుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బేస్‌మెంట్ లెవల్, పిల్లర్ లెవల్, స్లాబ్ లెవల్‌లో పనులు పూరైన వారి ఖాతాల్లో ప్రతి సోమవారం డబ్బులు జమవుతాయన్నారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ నవీన్ కుమార్, ఆర్‌ఐ శ్రీకాంత్, సీనియర్ అసిస్టెంట్ రాము తదితరులున్నారు.
ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి
బీబీనగర్: ప్రభుత్వం ఇచ్చిన నిర్ణీత గడువు లోపు లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంతురావు తెలిపారు. బీబీనగర్ మండలంలోని రుద్రవెళ్లి గ్రామంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం ఆయన పరిశీలించారు. నిబంధనల ప్రకారం నిర్మాణాలు ఉండాలని, నాణ్యత ప్రమాణాలతో కట్టుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు