
ఇల్లు ఇప్పించండి సారూ..
ఆలేరురూరల్: అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ఆలేరు మండలం శర్బనాపురం గ్రామానికి చెందిన గౌరగండ్ల ప్రమీల పెంకుటిల్లులో కిరాయికి ఉంది. రెండేళ్ల క్రితం వర్షాలకు అద్దె ఇళ్లు కూలిపోవడంతో అదే గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ భవనంలో నివాసం ఉంటుంది. 14 ఏళ్ల క్రితం ఈమె భర్త అనారోగ్యంతో చనిపోయాడు. కూలీ పనులు చేసుకుంటూ కుమారుడిని పోషించుకుంటుంది. ఈమెకు చెవిడు, మూగ. సైగలతోనే సమాధానం చెబుతుంది. ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకున్నా ఇల్లు మంజూరు కాలేదని, అధికారుల చుట్టూ తిరిగినా తన గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈవిషయమై ఎంపీడీఓ సత్యాంజనేయ ప్రసాద్‌ను సంప్రదించగా ప్రమీల పేరు ఆన్‌లైన్‌లో చూపించడం లేదని పేర్కొంటున్నారు.
ఫ ఇల్లు లేక ఎస్సీ కమ్యూనిటీ
భవనంలో నివాసం
ఫ అధికారుల చుట్టూ తిరుగుతున్న
శర్బనాపురానికి చెందిన మహిళ