
నృసింహుడి సన్నిధిలో రామచంద్రజీయర్ స్వామిజీ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జియర్ మఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ త్రిదండి రామచంద్రజీయర్ స్వామిజీ సోమవారం దర్శించుకున్నారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖమండపంలో ఉత్సవమూర్తుల చెంత అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. స్వామీజీకి అర్చకులు వేద పారా యణం చేశారు. అంతకుముందు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. ప్రతి ఆలయంలో భగవంతుడు కొలువై ఉంటాడని, కానీ యాదగిరి క్షేత్రంలో భగవంతుడితో పాటు ఆళ్వార్లు సైతం కొలువై ఉండటం ఆలయ విశిష్టత అని వెల్లడించారు. చాతుర్మాసా దీక్ష ప్రారంభమాసంలో శ్రీస్వామి వారిని దర్శించుకుని ధన్యులమైనట్లుగా స్వామీజీ పేర్కొన్నారు.